శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 10 అక్టోబరు 2019 (20:49 IST)

సూప‌ర్ స్టార్ కొత్త సినిమా ఎవ‌రితో తెలుసా..?

సూపర్ స్టార్ రజినీకాంత్.. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయ‌న రాజకీయాల్లోకి వ‌స్తార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. సినిమాల్లో మాత్రం జెడ్ స్పీడుతో దూసుకెళుతున్నారు. ప్ర‌స్తుతం సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ మురుగుదాస్‌తో ద‌ర్బార్ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
 
ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే... ర‌జినీకాంత్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ... యువ హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... హీరో అజిత్‌తో మూడు సూపర్ హిట్లు తీసిన మాస్ డైరెక్టర్ శివ రజినీకాంత్ కోసం సూపర్ సబ్జెక్ట్ రెడీ చేశారు. తలైవా రజినీకాంత్‌తో శివ డైరెక్షన్లో వచ్చే ఈ సినిమా చాలా హై లెవెల్లో రూపొందబోతోందని తెలుస్తోంది.
 
సన్ పిక్చర్స్ ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మించనున్నట్లు తెలిసింది. ఆల్రెడీ ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేసార‌ని... ఈ సినిమాని ఎప్పుడు ప్రారంభించేది త్వ‌ర‌లో అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం. మ‌రి.. అజిత్‌కి వ‌రుస విజ‌యాలు అందించిన శివ ర‌జినీకాంత్‌ని ఎలా చూపిస్తాడో చూడాలి.