శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (19:02 IST)

''దృశ్యం''కు రజనీ నో: ఆ రెండు సీన్స్ కోసమే.. నన్ను కొడితే..?

తమిళ దృశ్యం పాపనాశం సినిమాలో నటించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ నో చెప్పారట. అన్నీ భాషల్లో విడుదలైన దృశ్యం హిట్టయిన నేపథ్యంలో... తొలుత ఈ సినిమా తమిళ వర్షన్‌లో నటించేందుకు రజనీకాంత్‌ను దర్శకుడు జోతూజోసెఫ్ సంప్రదించారట. అయితే హీరో, హీరో కుటుంబాన్ని హింసించడం, క్లైమాక్స్ సీన్స్ విన్న రజనీకాంత్ నటించేందుకు తిరస్కరించారని జీతూ తెలిపారు.
 
తనను కొట్టడం చూస్తే తన ఫ్యాన్స్ తట్టుకోలేరని, సినిమాను  రిసీవ్ చేసుకోలేరని రజనీ చెప్పారని జీతూ అన్నారు. ఈ సినిమా స్టోరీని విన్న తర్వాత రజనీ చాలా సంతోషించారని... తనకు బాగా నచ్చిందని చెప్పారని జీతూ చెప్పారు. అయితే ఆ రెండు సీన్స్ వల్లే వద్దన్నారని తెలిపారు. రజనీ సార్ చెప్పిన దాంతో తాను కన్విన్స్ అయ్యానని... మరో మంచి స్క్రిప్ట్ తో మళ్లీ కలుస్తానని చెప్పి వచ్చానని జీతూ చెప్పారు.