1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జులై 2016 (17:05 IST)

'కబాలి' తొలి రోజు కలెక్షన్ రూ.250 కోట్లు: నిర్మాత కలైపులి ఎస్ థాను ప్రకటన

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం 'కబాలి' తొలి రోజునే రూ.250 కోట్లను వసూలు చేసిందని చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఒక ప్రకటనలో తెలిపారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం 'కబాలి' తొలి రోజునే రూ.250 కోట్లను వసూలు చేసిందని చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే రూ.100 కోట్ల కలెక్షన్లు వసూలయ్యాయని, మిగతా అన్ని చోట్ల నుంచి రూ.150 కోట్లు వచ్చిందని ఆయన తన ప్రకటనలో వివరించారు.
 
ముఖ్యంగా.. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్లర్లాండ్, డెన్మార్క్, సాలెండ్, స్వీడన్, సౌతాఫ్రికా, నైజీరియా, మలేషియా తదితర దేశాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, రజినీ స్టామినాకు ఇదే నిదర్శనమన్నారు. ఓ భారత నటుడి సినిమాకు తొలి రోజున వచ్చిన అత్యధిక కలెక్షన్లు ఇవేనని ప్రకటించారు. యఎస్‌లో 480, మలేషియాలో 490, గల్ఫ్ దేశాల్లో 500 థియేటర్లలో చిత్రం విడుదల చేయగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల స్క్రీన్లలో సినిమా ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదిలావుండగా, ‘ఫోర్బ్స్’ పత్రికతో ‘కబాలి’ నిర్మాత కలైపులి ఎస్ థాను మాట్లాడుతూ, ఈ చిత్రం సీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నానని, దరిదాపు సీక్వెల్ చేయడం ఖాయమన్నారు. కాగా, మలేషియా ‘కబాలి’ క్లైమాక్స్‌లో రజనీకాంత్ పోలీసులకు లొంగిపోతాడని ప్రకటించగా, తెలుగు క్లైమాక్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 
 
తుపాకీ పేలుడు శబ్దం వినిపించడం, ఆ బుల్లెట్ కు రజనీకాంత్ చనిపోయాడా? లేదా? అనే విషయాన్ని మాత్రం దర్శకుడు పా.రంజిత్ చూపించలేదు. ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండిపోయింది. దీంతో, ‘కబాలి’ సీక్వెల్ కు అవకాశమున్నట్లు రజనీ అభిమానులు, ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.