బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (11:36 IST)

రజనీకాంత్ ఆరోగ్యం ఆందోళనకరమా? ప్రత్యేక విమానంలో అమెరికాకు?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం ఆందోళనగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లినట్టు వినికిడి. 
 
నిజానికి తాను నటిస్తున్న అన్నాత్త సినిమా షూటింగ్‌లో భాగంగా తన పార్ట్‌ను రజనీకాంత్ ఎపుడో పూర్తి చేశారు. అలాగే, తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా చెప్పేశారు. ఇపుడు అమెరికా వెళ్లేందుకు కేంద్రం అనుమతి కోరారు. ప్రత్యేక విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్న రజనీకాంత్... ఇందుకోసం కేంద్రం అనుమతి కోరగా, కేంద్రం కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 
 
వాస్తవానికి ఆయన ఆరోగ్యంగానే వున్నారు. అయితే, తన వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 16 మంది ప్రయాణించగల చిన్నపాటి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు.
 
కాగా, ఇప్పటికే హాలీవుడ్‌ చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’ నిమిత్తం అమెరికాలో ఉన్నారు రజనీ అల్లుడు, హీరో ధనుష్‌. అలాగే ధనుష్‌ భార్య ఐశ్వర్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారట. కాగా, రజనీ అమెరికా వెళ్లారనే వార్త వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.