బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: శనివారం, 2 జూన్ 2018 (18:23 IST)

క్ష‌మాప‌ణ‌లు చెప్పినా... 'కాలా'ను వీడ‌ని క‌ష్టాలు

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం కాలా. క‌బాలి ఫేమ్ రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కాలా చిత్రం ఈ నెల 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేదుకు రెడీ అవుతోంది. అభిమానులు ఎప్ప‌టి నుంచో ఈ సినిమా గురించి వెయిట్ చేస్తుండ‌టంతో ఎప్పుడ

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం కాలా. క‌బాలి ఫేమ్ రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కాలా చిత్రం ఈ నెల 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేదుకు రెడీ అవుతోంది. అభిమానులు ఎప్ప‌టి నుంచో ఈ సినిమా గురించి వెయిట్ చేస్తుండ‌టంతో ఎప్పుడెప్పుడు కాలా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే... క‌ర్నాట‌క‌లో మాత్రం కాలా విడుద‌ల కానివ్వం అని అంటున్నారు. ఎందుకంటే... కావేరి జ‌లాలు విష‌యంలో త‌మిళ‌నాడుకు మ‌ద్ద‌తుగా ర‌జనీ, క‌మల్ మాట్లాడ‌టమే.
 
ఈ విష‌యంపై ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ.. బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయినా కూడా క‌ర్నాట‌క‌లో కాలా చిత్రం విడుల కానివ్వం అంటున్నారు క‌న్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి. క‌ర్నాట‌క‌లో కాలా రిలీజ్‌ని అడ్డుకోవ‌డంపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు స్పందిస్తూ.. ఇది క‌రెక్ట్ కాద‌న్నారు. అయినా... క‌న్న‌డ ర‌క్ష‌ణ వేదిక త‌గ్గ‌డం లేదు. మ‌రి... సౌత్ ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుదో..? కాలా క‌ర్నాట‌క‌లో రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.