రాఖీ సావంత్‌‌ని వదలని వివాదాలు.. లైన్లోకి దీపక్.. మరి భర్త సంగతేంటి?

Last Updated: మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:49 IST)
బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌‌ని పెళ్లికి తర్వాత కూడా వివాదాలు వదలట్లేదు. బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ రహస్యంగా వివాహం చేసుకోవడంపై ఆమె మాజీ ప్రియుడు దీపక్‌ ఖలాల్‌ షాక్‌ తిన్నాడు. దీపక్‌తో తన వివాహం జరగనుందని కొన్ని నెలల క్రితం రాఖీ ప్రకటించారు. కానీ ఆయన్ని వివాహం చేసుకోకుండా.. రాఖీ ఓ ఎన్నారైను రహస్యంగా వివాహం చేసుకుంది. దీంతో ఫ్యాన్స్‌తో పాటు దీపక్‌ కూడా షాకయ్యారు. 
 
ఈ నేపథ్యంలో రాఖీ తనను మోసం చేసిందంటూ దీపక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. తనకు రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు నాలుగు రోజుల్లో డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించారు.  
 
అయితే పెళ్లికి తర్వాత తన ఎన్నారై భర్త విదేశాలకు వెళ్లిపోయారని.. వీసా వచ్చిన తర్వాత తాను కూడా ఫారిన్‌కు వెళ్తానని, అక్కడ స్థిరపడిపోతానని రాఖీ సావంత్ తెలిపింది. ఇంకా దీపక్‌ వ్యాఖ్యల్ని రాఖీ ఖండించింది.


తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న దీపక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తన భర్త గురించి తప్పుగా మాట్లాడుతున్న దీపక్ తనను ఏమీ చేయలేడని ఆమె వరుస వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.
దీనిపై మరింత చదవండి :