సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (13:39 IST)

రాఖీ సావంత్‌పై తనుశ్రీ రూ. 10 కోట్ల దావా

బాలీవుడ్ నటీమణులు రాఖీ సావంత్, తను శ్రీ దత్తాల మధ్య నెలకొన్న వివాదం మరింత రాజుకుంది. తనను లెస్బియన్ అని, డ్రగ్స్‌కు బానిసని వ్యాఖ్యానించిన రాఖీ సావంత్‌పై తనుశ్రీ రూ. 10 కోట్ల దావా వేసింది. తాజాగా రాఖీ కూడా తను శ్రీపై పరువునష్టం దావా వేసింది. కానీ తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆమె నుంచి 25పైసల నష్ట పరిహారం ఇప్పించాలని రాఖీ కోర్టును ఆశ్రయించింది.
 
తాను ఆర్థికంగా భారీ నష్టాల్లో వున్నాను. భారీగా నష్టపరిహారం కోరి మరిన్ని కష్టాల్లో పడలేనని.. ఎన్నో ఏళ్లుగా కాపాడుకున్న తన పరువు మర్యాదలను తను శ్రీ నాశనం చేయాలని చూస్తోందని.. ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకే ఈ దావా అని రాఖీ తెలిపింది. డబ్బు కోసం రాఖీ ఎంతకైనా దిగజారుతుందని, నీచమైన పనులకు పాల్పడుతుందని తనుశ్రీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. నటి తనూ శ్రీదత్తాకు సెలబ్రిటీల మద్దతు పెరుగుతోంది. సీనియర్‌ నటుడు నానా పటేకర్‌పై హీరోయిన్‌ తను శ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేసింది. పదేళ్ల క్రితం తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. డ్యాన్స్‌ భంగిమలు నేర్పుతానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే.