Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోలివుడ్ పిలుస్తోందని టాలీవుడ్‌ను వదులుకుంటానా.. నెవర్ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్

హైదరాబాద్, సోమవారం, 29 మే 2017 (06:29 IST)

Widgets Magazine
rakul

ఇప్పటివరకు కొలివుడ్‌లో విజయాలను నమోదు చేయని టాలివుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమిళ చిత్ర సీమ అవకాశాల కోసం టాలివుడ్‌లో చాన్సులను పణంగా పెట్టబోనని స్పష్టం చేస్తోంది. తెలుగులో ఆగ్రనటుల సరసన బంపర్ హిట్ కొడుతూ నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకున్న రకుల్ తెలుగు సినిమాలను వదులుకుని మరీ తమిళ చిత్రరంగాన్ని కావిలించుకునే పిచ్చి పని చేయబోనని సంకేతాలు వెలువరిస్తోంది.
 
టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఇంకా విజయాల ఖాతాను ఓపెన్‌ చేయలేక పోయింది. తాజాగా ఇక్కడ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కార్తీకి జంటగా ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా విశాల్‌కు జంటగా తుప్పరివాలన్‌ చిత్రంలో నటించడానికి సమ్మతించి ఆ తరువాత వైదొలగింది.
కాగా దర్శకుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య సరసన నటించడానికి రకుల్‌ ఎంపికైంది.  తాజాగా  సెల్వరాఘవన్‌ చిత్రానికి కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. 
 
సెల్వరాఘవన్‌ ప్రస్తుతం సంతానం హీరోగా మన్నవన్‌ వందానడీ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికి 35 శాతం షూటింగ్‌ మాత్రమే పూర్తి చేసుకుందని సమాచారం. చిత్రాన్ని పూర్తి చేయడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉందట. అదే విధంగా నటుడు సూర్య ప్రస్తుతం విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో తానాచేర్నద కూటం చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తీసురేశ్‌ నాయకి. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని సమాచారం. దీంతో సూర్య తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. 
 
దర్శకుడు సెల్వరాఘవన్‌ కోసం సూర్యతో పాటు నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి. అయితే ఆ అమ్మడికి తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయట. వాటిని వదులుకుని సెల్వరాఘవన్‌ చిత్రం కోసం ఎదురు చూసేంత సీన్‌ లేదని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి 2 అద్భుతం. ప్రభాస్ నటన మరీ అద్భుతం.. బాలీవుడ్ సహజనటుడు సిద్ధీఖి ప్రశంసలు

విడుదలై అయిదో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ బాహుబలి 2 ప్రభంజనం తగ్గడం లేదు. అయిదోవారం కూడా ...

news

బాహుబలి2 సినిమాపై నా భయాన్ని మొత్తంగా పొగొట్టిన కాంప్లిమెంట్ అది: రాజమౌళి

బాహుబలి 2 సినిమాపై ఒక ఎన్నారై డాక్టర్ నుంచి వచ్చిన అభినందన జీవితకాలంలో మర్చిపోలేనని ...

news

బాలీవుడ్ ఖాన్‌లకు వయస్సు మీరుతోందా.. దూరం జరుగుతున్న కుర్ర హీరోయిన్‌లు

బాలీవుడ్‌ను పాతికేళ్లకు పైగా ఏలుతున్న ఖాన్‌ల త్రయానికి వయసు మీద పడుతోందా.. ఆ మాటంటే ...

news

ముంబైలో సాహో షూటింగ్ త్వరలో స్టార్ట్.... అటు ప్రభాస్ పెళ్లికి కూడా సంబంధం ఫిక్స్

'బాహుబలి' రెండు పార్టులకోసం దాదాపు ఐదేళ్ల సమయాన్ని వెచ్చించిన ప్రభాస్.. ఇప్పుడు 150 కోట్ల ...

Widgets Magazine