గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (12:59 IST)

నాకొచ్చే మొగుడు ఎలా ఉండాలంటే.. వివరించిన రకుల్ ప్రీత్

బాలీవుడ్ చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కోణంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న హీరోయిన్లల్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఆ సమయంలో ఈమె గురించి అనేక కథనాలు వచ్చాయి. ఇలాంటి కథనాలు ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ రకుల్ ప్రీత్ సింగ్ కోర్టును కూడా ఆశ్రయించారు. 
 
ఈ క్రమంలో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం ఉందని, తనకు కాబోయే భర్తకు ఈ జీవితం పట్ల ఖచ్చితమైన స్పష్టత, అభిరుచి ఉండాలని చెప్పుకొచ్చింది. 
 
తాను సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం నుంచి వచ్చానని తెలిపింది. తన తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేసిన కారణంతో తాను అందుకు సంబంధించిన వాతావరణంలోనే  పెరిగానని తెలిపింది.
 
 తనకు కాబోయే భర్త ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే సంతోషిస్తానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే తన పెళ్లి జరగాలని ఆశిస్తున్నానని చెప్పింది. తాను బీచ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది.
 
కాగా, ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అలాగే, మరికొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.