శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (11:19 IST)

నాన్నకు ప్రేమతో: సినిమాకు డబ్బింగ్ చెప్పుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే నాన్నకు ప్రేమతో సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ డబ్బింగ్ చెప్పుకుంటోంది. రకుల్‌కి ముందుచూపు ఎక్కువని, ఏ విషయాన్ని ఒక పట్టాన వదిలే రకం కాదని సన్నిహితులు చెప్తున్నారు. ఆ పట్టుదలతోనే ప్రస్తుతం రకుల్ డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి ఎదిగింది. తెలుగు భాషను నేర్చుకుని, 'నాన్నకు ప్రేమతో' సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకునే వరకూ వచ్చేసింది. రకుల్ ప్రీత్ తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతూనే, తెలుగు భాషపై దృష్టి పెట్టిందట.
 
సెట్లోను అందరితో తెలుగు భాష మాట్లాడటానికే ప్రయత్నిస్తూ, మొత్తానికి నేర్చేసుకుంది. ఆమె తెలుగును చక్కగా మాట్లాడుతుండటాన్ని గమనించిన సుకుమార్.. 'నాన్నకు ప్రేమతో' సినిమా నుంచే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టమని అన్నాడట. అంతే రకుల్ ఆనందం అంతా ఇంతా కాదు.. వచ్చే నెలలో ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుకానున్న తరుణంలో ఒకసారి ఆమె వాయిస్ టెస్ట్ చేసి .. ఓకే అనుకుంటే ఆమెతోనే డబ్బింగ్ చెప్పించవచ్చని సుకుమార్ టీమ్ ప్లాన్ చేస్తోంది.