Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భ్రమరాంబకు పవన్ తెగ నచ్చేశాడట.. ఛాన్సొస్తే మాత్రం వదులుకోదట..

గురువారం, 15 జూన్ 2017 (09:47 IST)

Widgets Magazine
rakul

టాప్ హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పవన్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మనసు పడింది. పవన్‌తో ఇప్పదిదాకా కలిసి నటించని ఈ ముద్దుగుమ్మ.. మంచి ఛాన్స్ వస్తే వదిలిపెట్టేది లేదంటోంది. ఇటీవలే తనకు పవన్ కళ్యాణ్ సరసన నటించాలని ఉన్నట్లు తెలిపింది. రకుల్ చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నది. 
 
ఈ చిత్రంలో రకుల్ పోషించిన భ్రమరాంబ పాత్రకు ప్రశంసలు లభించాయి. టాలీవుడ్‌లో యువ హీరోలతోపాటు, టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మహేశ్ బాబుతో స్పైడర్ చిత్రంలో నటిస్తున్నది. అయితే ఈ బ్యూటీకి ఓ తీరని కోరిక ఏంటంటే? పవన్‌తో నటించలేదనేదే. పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు స్వయంగా రకులే చెప్పింది. 
 
కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో పవన్ నటిస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత మహా అంటే మరో సినిమాలో నటించే అవకాశం కనిపిస్తున్నది. ఆ తర్వాత రాజకీయాలకు పరిమితం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వస్తే వదులుకోకూడదని భ్రమరాంబ భావిస్తోంది. 
 
ఇకపోతే రకుల్ ప్రీస్ సింగ్ బుధవారం హైద‌రాబాద్‌లోని బేగంపేటలో సందడి చేసింది. ఫిల్మ్‌ఫేర్‌ నిర్వహించిన సెలబ్రిటీ మీట్‌ అండ్‌ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొని ఆమె అభిమానుల‌తో ఫొటోలు దిగింది. ఈ సంద‌ర్భంగా అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు ఇచ్చింది. త్వరలో జరగనున్న ఫిల్మ్‌ఫేర్ వేడుక‌లో తన డ్యాన్స్ ఉంటుంద‌ని చెప్పింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రకుల్ ప్రీత్ సింగ్‌కు "స్పైడర్" అన్యాయం చేశాడా?

టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు కోసమే స్పైడర్‌ను ఓకే ...

news

శమంతకమణిలో మహేష్ బాబు?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు శమంతకమణిలో కనిపించనున్నారనే వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ...

news

'జిక్యూ' టాప్-50లో రామ్ చరణ్: బెస్ట్ డ్రెస్డ్ సెలెబ్రిటీల్లో చెర్రీకి 15వ స్థానం.. మరి బన్నీ, ప్రిన్స్ సంగతి?

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ప్రముఖ మెన్స్ మేగజైన్ 'జిక్యూ' జాబితాలో టాప్-50లో నిలిచాడు. ...

news

సన్యాసినిగా మారి హిమాలయాలకు వెళ్లతానని చెప్పానా.. మళ్లీ ప్రేమ పెళ్ళే అంటున్న కుర్రనటి

చాలా చిన్న వయస్సులో మలయాళీ చిత్ర దర్శకుడు విజయ్‌ని 2015లో ప్రేమించి పెళ్లాడిన అమలాపాల్ ...

Widgets Magazine