సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 30 ఆగస్టు 2019 (19:31 IST)

నా డార్లింగ్ ఇరగదీశాడు- మెగా పవర్ స్టార్

నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ప్రభాస్ తన సొంత డబ్బులతో భారీ థియేటర్‌ను నిర్మించారు. ఆ థియేటర్‌ను నిన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ ప్రారంభించారు. ప్రభాస్, రాంచరణ్‌కు మధ్య ఉన్న స్నేహమే ఆ థియేటర్ ప్రారంభోత్సవానికి కారణమైందని నిర్వాహకులు చెబుతున్నారు. 
 
అయితే ప్రభాస్ నటించిన 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ సాహో సినిమా ఈ థియేటర్లోనే ప్రదర్సితమవుతోంది. సినిమా ప్రదర్సితమవడానికి ఒకరోజు ముందుగానే థియేటర్‌ను ప్రారంభించారు రాంచరణ్. విడుదలైన సినిమాను రాంచరణ్ ఆశక్తిగా కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారట.
 
సినిమా అద్భుతంగా ఉందని, ప్రభాస్ నటన బాగుందని, ట్విస్ట్‌లతో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని రాంచరణ్ చెప్పారట. ఒక హీరోను మరో హీరో పొగుడటం డార్లింగ్ అభిమానులను సంతోషించేలా చేస్తోందట.