గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 27 మార్చి 2023 (17:14 IST)

38వ పుట్టినరోజును జరుపుకున్న రామ్‌చరణ్, ఐఎండిబిలో అతని టాప్ 8 అత్యధిక రేటింగ్ సినిమాలివే

Ram Charan movies
తెలుగు చిత్రసీమలో కెరీర్ ప్రారంభించిన రామ్ చరణ్ ఇన్నేళ్లలో తన అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. నేడు తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ తన నటనతో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్‌లో చరణ్ నటన భారతదేశాన్ని ఆస్కార్ స్టేజ్ వరకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ఇటీవల ‘నాటు నాటు’ పాట 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్'గా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది, అక్కడ అతను హాలీవుడ్ అరంగేట్రం గురించి కూడా సూచించాడు.
 
2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బాస్టర్ ‘చిరుత’ సినిమాతో సినిమాల్లోకి అరంగేట్రం ఇచ్చిన రామ్ చరణ్, రాజమౌళి తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్ మూవీ మగధీరతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రంగస్థలం 1985, ధృవ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఈద్ పండుగ సందర్భంగా విడుదల కానున్న సల్మాన్ ఖాన్ థ్రిల్లర్ 'కిసి కా భాయ్ కిసీ కీ జాన్'లో చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
 
ఐఎండిబిలో అతని టాప్ 8 అత్యధిక రేటింగ్‌తో ఉన్న సినిమాలు ఇవే.
1.     రంగస్థలం 1985 - 8.2
2.     ఆర్ఆర్ఆర్ (RRR) - 7.9
3.     మగధీర - 7.7
4.     ధృవ - 7.7
5.     ఆరెంజ్ - 6.6
6.     ఎవడు - 5.8
7.     గోవిందుడు అందరి వాడేలే - 5.7
8.     నాయక్ - 5.6