సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:05 IST)

రామ్ చ‌ర‌ణ్ స్పెష‌ల్ డిజైన్ కారు వ‌చ్చేసింది

charan new car
రాంచరణ్ మరో కొత్త కారును కొనుగోలు చేశారు. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ఆయ‌న బుక్ చేసిన స్పెష‌ల్ డిజైన్ కార్ ఇంటికే డెలివిరీ అయింది. ఇప్పటికే చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ కార్లు వున్నాయి. కాగా, బ్లాక్ క‌ల‌ర్‌‘మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్‌ 600’ సరికొత్త కారు కూడా ఆయన ఖాతాలో చేరింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌. చిత్రం షూట్ త‌ర్వాత ఇది కొన‌డం అభిమానుల్లో ఆనందాన్ని సంత‌రించుకుంది. రామ్‌చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియాలో కారు డెలివ‌రీ అయ్యే విధానంతోపాటు కంపెనీ సిబ్బందితో దిగిన ఫొటోలు పెట్టారు. ఈ కారు త‌న‌కు తెలిసిన నాలెడ్జ్‌తో అధునాత‌నంగా డిజైన్ చేసిన‌ట్లు తెలిసింది. అందుకే స్పెష‌ల్ డిజైన్ ఫ‌ర్ మిస్ట‌ర్ రామ్‌చ‌ర‌ణ్ అంటూ స్రోల్ కూడా పెట్టాడు.
 
charan new car
అనంత‌రం కారులో ఆయ‌న డ్రైవ్ చేస్తూ క‌నిపించారు. కాగా, ఈ కారు రెండున్న‌కోట్లు వుంటుంద‌ని స‌మాచారం. అయితే కొద్దిరోజుల నాడే ఎన్‌.టి.ఆర్‌.కూడా కొత్త‌కారును కొనుగోలు చేశాడు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా పారితోషికంలో భాగంగా నిర్మాత‌లు ఇచ్చిన గిఫ్ట్ గా కొంద‌రు భావిస్తున్నారు. వీరిద్ద‌రు న‌టిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఇంకా విడుద‌ల‌తేదీ కొంత మార్పు వున్న‌ట్లు తెలుస్తోంది.