Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీమంతుడిని వెనక్కి నెట్టిన ''రంగస్థలం'': సీక్వెల్‌లో చిట్టిబాబుకు సౌండ్ వినిపిస్తుందట..

సోమవారం, 9 ఏప్రియల్ 2018 (09:22 IST)

Widgets Magazine
rangasthalam movie still

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రంగస్థలం. ఈ సినిమా గతవారం విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చెర్రీ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అమెరికాలో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టింది. ఇప్పటివరకూ బాహుబలి-2, బాహుబలి-1 సినిమాల తరువాత మూడో స్థానంలో మహేష్ బాబు ''శ్రీమంతుడు'' ఉండగా, ''రంగస్థలం'' దాన్ని కిందకు నెట్టేసింది. 
 
''శ్రీమంతుడు'' చిత్రం 2.89 మిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు చేయగా, ''రంగస్థలం'' తొలి పది రోజుల వ్యవధిలోనే 3 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. ఈ సినిమా మరింత కలెక్షన్లను సాధించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా 4 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన రంగస్థలం సినిమా గతవారమే విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్‌పై సుకుమార్ మాట్లాడుతూ ''ప్రేక్షకులకు ఇంత దగ్గరైన చిట్టి బాబు పాత్రను ఇంతటితో వదిలేయాలనుకోవడం లేదు. ఈ పాత్రను కొనసాగించే ఆలోచన చేస్తున్నానని..ఈ సారి చేస్తే చిట్టి బాబుకు చెవిటి ఆపరేషన్ చేయించి సరికొత్త కథ కథనాలతో ఉంటుందని తెలిపాడు. అలాగే సరికొత్త మేకోవర్‌లో, మాటలు వినగలిగే వాడిగా మారుస్తానని సుకుమార్ చెప్పుకొచ్చాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''భరత్ అనే నేను'' మేకింగ్ వీడియో

టాలీవుడ్ మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ''భరత్‌ ...

news

అకీరాకు మెగా హీరోల శుభాకాంక్షలు.. రేణూ దేశాయ్ భావోద్వేగం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రేణు దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ 14వ పుట్టినరోజును ఆదివారం ...

news

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. డైలాగ్ ఎంపాక్ట్ రిలీజ్ (వీడియో)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తాజా సినిమా ''నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా''. ఈ చిత్రంలో ...

news

బట్టలు విప్పేసుకుంటే వేషాలిస్తారా? శ్రీరెడ్డిది చీప్ పబ్లిసిటీ: నటి హేమ (వీడియో)

టాలీవుడ్‌లో అవకాశాలు రాకుండా ఉన్న ఆర్టిస్ట్‌లు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారని.. సీనియర్ ...

Widgets Magazine