ఆయ‌న‌కి నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను: రామ్ చ‌ర‌ణ్‌(Video)

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం రంగ‌స్థ‌లం. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన రంగ‌స్థ‌లం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా రంగ‌స్థ‌లం 100 రోజుల వేడుక‌ను హైద‌రాబాద్ ఎన్

Ram Charan
srinivas| Last Modified సోమవారం, 9 జులై 2018 (20:09 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం రంగ‌స్థ‌లం. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన రంగ‌స్థ‌లం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా రంగ‌స్థ‌లం 100 రోజుల వేడుక‌ను హైద‌రాబాద్ ఎన్ క‌న్వెన్షన్‌లో చిత్ర ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. 
 
ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.... ఈ సినిమా వంద రోజులు ఆడిందంటే.. దాని వెనుక చాలామంది కృషి, కష్టం ఉన్నాయి. సినిమా అనేది ఒకరి ఆలోచన నుంచే మొదలవుతుంది. అతనే దర్శకుడు. సుకుమార్‌ ఎప్పుడైతే పెన్ను పట్టుకున్నారో.. అప్పుడే ‘రంగస్థలం’ అనే గొప్ప కథ మొదలైంది. దేవిశ్రీ ప్రసాద్‌, రత్నవేలు, నేనూ... నాతో పాటు ఇంతమంది కలసి ఇలా పనిచేశామంటే అదంతా సుకుమార్‌ ఆలోచన వల్లే అన్నారు.
 
ప్ర‌స్తుతం మూడు వారాలే ఆడుతున్న ఈ రోజుల్లో ఈ సినిమా వంద రోజుల స‌క్స‌స్‌ఫుల్‌గా ఆడింది. దీనికి కార‌ణం సుకుమార్. అందుకు సుక్కుకి నా జీవితాంతం రుణపడి ఉంటాను. దేవి పాటలకు డ్యాన్స్‌ చేయడం ఓ సవాల్‌. నాతో కష్టపడి డ్యాన్సులు చేయిస్తుంటారు మా డ్యాన్సు మాస్టర్లు. సమంత బాగా నటించింది. రంగమ్మత్త పాత్రని అనసూయ చాలా బాగా పోషించింది. ఏ విషయమైనా మన తల్లిదండ్రుల నుంచీ గురువుల నుంచి నేర్చుకుంటుంటాం. 
 
మా నాన్న నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఖైది నెం 150తో ఆయన పునరాగమనం చేశారు. ఆ సమయంలో ఆయన్ని బాగా గమనించా. ఆయన కష్టం చూస్తే ఉత్తినే ఓ వ్యక్తిపై ఇంత ప్రేమ ఎందుకు వస్తుంది? కేవలం మంచి సినిమాల వల్ల, పాత్రల వల్ల రాదనిపించింది. పైకి వస్తూ వెంట వున్న పదిమందిని మనతో తెస్తే మనం కష్టంలో వున్నప్పుడు వారు మనల్ని పైకి లాగుతారని మా నాన్న అంటుంటారు. అందుకే ఆయనకు ఇంతమంది ఫాలోయర్స్ వున్నారు. చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు సంతోషంగా ఉంటే మేమంతా బాగుంటాం. ఇక నుంచి వచ్చే ప్రతి సినిమా బాగా ఆడాలి. పరిశ్రమ బాగుండాలి అన్నారు. చరణ్ మాటలను వీడియోలో చూడండి...దీనిపై మరింత చదవండి :