శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2017 (12:16 IST)

ఆ ముగ్గురిపై ఒట్టేసి చెప్తున్నా.. ఇకపై అలాంటి ట్వీట్స్ జోలికెళ్లను: రామ్ గోపాల్ వర్మ ప్రకటన

వివాదాలంటే తెగ ఇష్టపడే... ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రముఖ రామ్ గోపాల్ వర్మ ఇక నుంచి ఎవరి జోలికీ వెళ్లడట. ట్విట్టర్లో నోటికొచ్చినట్లు మాట్లాడనని స్వయంగా చెప్పేశాడు. ముఖ్యంగా పవర్

వివాదాలంటే తెగ ఇష్టపడే... ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రముఖ రామ్ గోపాల్ వర్మ ఇక నుంచి ఎవరి జోలికీ వెళ్లడట. ట్విట్టర్లో నోటికొచ్చినట్లు మాట్లాడనని స్వయంగా చెప్పేశాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఆయన సినిమాలను ఏకిపారేసి.. ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైన రామ్ గోపాల్ వర్మ.. ఇకపై ఎవ్వరినీ కష్టపెట్టే.. ఇబ్బంది పెట్టే కామెంట్స్ చేయనని తెలిపాడు. 
 
తాను దేవుడిని నమ్మను కాబట్టి.. తన మాటల్ని మీరు కూడా నమ్మరని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. అందుకే ఇకపై ఇతరుల జోలికీ పోనని.. ఇది మా అమ్మ, దర్శకుడు స్పీల్ బర్గ్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లపై ఒట్టేసి చెప్తున్నానని ట్విట్టర్లో తెలిపాడు. 
 
ఇకపోతే.. బాలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు విద్యుత్ జమాల్‌పై నోరు పారేసుకోవడంతోనే రామ్ గోపాల్ వర్మకు బుద్ధొచ్చిందని బిటౌన్ జనం అనుకుంటున్నారు. విద్యుత్ జమాల్‌ను, టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్‌ను పోల్చుతూ వర్మ చేసిన ట్వీట్స్ వివాదాస్పదమైనాయి. 
 
ఈ ట్వీట్లపై జమాల్ ఫైర్ అయ్యాడు. అంతేగాకుండా షావోలిన్ మాంక్ స్టైల్‌ను పూర్తిగా మర్చిపోయి.. వర్మ డ్రంకన్ మాస్టర్ స్టైల్‌ను ట్రై చేస్తున్నాడని కౌంటర్ ఇచ్చాడు. ఈ కౌంటరే వర్మకు మంచి బుద్ధినిచ్చిందని, అందుకే ఇకపై ఇతరులను ఇబ్బంది పెట్టే ట్వీట్స్ చేయనని ప్రకటించేలా చేసిందని సినీ జనం అంటున్నారు.