శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (13:48 IST)

జూనియర్ ఎన్టీఆర్ నో రెస్పాన్స్.. టీడీపీ ఫ్యూచర్ దబిడి దిబిడే

Ram Gopal Varma
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇష్యూపై వివాదాస్పద దర్శకుడు సంచలన పోస్టులు పెడుతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. చంద్రబాబు అరెస్ట్‌ని ఎన్టీఆర్ పట్టించుకోవడం లేదని అర్థమవుతోందంటూ చిచ్చు పెట్టారు ఆర్జీవీ. 
 
ఈ విషయాన్ని ప్రస్తుతం ఆర్జీవీ వివాదం చేస్తున్నాడు. చంద్రబాబు అరెస్ట్‌ని జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఖండించలేదు. దీన్ని బట్టి టీడీపీ ఫ్యూచర్ దబిడి దిబిడే అంటూ కాంట్రవర్సీలకు దారితీసే ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. 
 
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. వర్మ చేసిన ఈ ట్వీట్ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య మాటల దాడికి కారణమవుతోంది. కాగా చంద్రబాబు అరెస్ట్‌‌పై జూనియర్ ఎన్టీఆర్ నోరు మెదపలేదు. ఏదో సినిమాలు చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే.