సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (13:15 IST)

కాంతారపై ఆర్జీవీ... వారికి హార్ట్ ఎటాక్ తీసుకొస్తుంది.. రామ్ గోపాల్ వర్మ

kantara
కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ముందుగా కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళంలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. అంతేగాకుండా ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది. డైరెక్టర్ రిషబ్ ప్రధాన పాత్రలో నటించిన కాంతారా కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర వంటి పెద్ద చిత్రాలను బీట్ చేసింది.   
 
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. వరుస ట్వీట్లతో కాంతర సినిమాను ఆకాశానికెత్తేశాడు. కాంతార సినిమా భారీ బడ్జెట్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసిందని ట్వీట్ చేశాడు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలకు ఈ సినిమా కలెక్షన్లు ఓ పీడకల అని.. రూ.300 కోట్లు, 400కోట్లు, 500 కోట్ల బడ్జెట్ సినిమాలు తీసే వాళ్లకి ఈ సినిమా హార్ట్ ఎటాక్ తీసుకొస్తుందన్నాడు. 
 
అంతేగాకుండా రాబోయే తరాలకు కాంతార ఓ గుణపాఠం తెలిపాడు. భారీ బడ్జెట్ సినిమాలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయనే నానుడిని కూడా కాంతార సినిమాతో రిషబ్ షెట్టి మార్చేశాడన్నాడు. కాంతార వంటి అద్భుతమైన సినిమాని అందరికీ అందించినందుకు వర్మ ధన్యవాదాలు తెలిపాడు. సినీ ఇండస్ట్రీ వారంతా మీకు ట్యూషన్ ఫీజు చెల్లించాలంటూ వర్మ కామెంట్ చేశాడు.