మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (20:38 IST)

రాజకీయాలా... నేను అలాంటి వ్యక్తిని కాదు.. రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయ ప్రవేశంపై స్పందించాడు. త‌నకు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ‌మే లేద‌ని చెప్పాడు.

ఎందుకంటే జ‌నాల‌కు తాను సేవ చేయ‌లేన‌ని, అలాంటి క్యారెక్ట‌ర్ త‌న‌ది కాద‌ని స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవాళ్లు సేవ‌చేయాల‌నుకుంటార‌ని, తాను అలాంటి వ్య‌క్తిని కాద‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేశాడు. 
 
ఇక తాను ఒక ఫ్రెండ్‌తో క‌లిసి స్పార్క్ ఓటీటీని తీసుకొస్తున్న‌ట్టు చెప్పాడు. ఇది రేప‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని, తాను డైరెక్ట్ చేసిన డీ కంపెనీ సినిమాతోనే స్టార్ట్ అవుతుంద‌ని వివ‌రించాడు.