శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జూన్ 2021 (19:15 IST)

రేవంత్ రెడ్డిని సింహంతో.. మిగిలిన నేతలను పులులతో పోల్చిన వర్మ!

సంచలనాత్మక దర్శకుడు వివాదాలకు ఎప్పుడూ కేరాఫ్ ఎడ్రెస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి మరొక పొలిటికల్ పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేసారు. తాజాగా తెలంగాణాలో కాంగ్రెస్ పీసీసీ అద్యక్ష పదవికి ఎన్నికైన సందర్భంగా రామ్ గోపాల్ వర్మ రేవంత్ రెడ్డిని సింహంతో పోలుస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసారు. అయితే రేవంత్ రెడ్డిని సింహతో పోల్చిన వర్మ మిగతా నాయకులను పులులతో పోల్చారాయన.
 
ఇక సింహం ట్రాక్‌లోకి వచ్చింది ఇక పులులుతనకు సైడ్ ఇవ్వాల్సిందేనంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు వర్మ. ఇప్పటికే టీపీసీసీ పదవి దక్కలేదని అసహనంతో ఉన్న నేతలు చాలా మందే ఉన్నారు. తాజాగా రేవంత్ కు పీసీసీ పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఒక విధంగా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసారు.
 
నాకు రేవంత్ రెడ్డి ఇష్టమున్నా లేకున్నా పార్టీ అధిష్టానం ఇలా చెస్తుందని అనుకోలేదంటూనే ఏదేమైనా పార్టీ నిర్ణయం ఫైనల్ కాబట్టి తాను రేవంత్ రెడ్డితో కలిసి పనిచెయ్యాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం పీసీసీ అద్యక్ష పదవి దక్కలేదని అసహనంతో ఉన్న నాయకులను రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లతో మరింత అసహనానికి గురిచేసినట్లయింది.