శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (16:56 IST)

రాంగోపాల్ వర్మ ట్వీట్ : జల్లికట్టు సంప్రదాయమైతే... ఆల్‌ఖైదా రక్తపాతం కూడా కరక్టే!

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ మరోమారు ట్వీట్‌తో వార్తలకెక్కాడు. ఈ దఫా ఆయన జిల్లికట్టును తన ట్వీట్‌కు ప్రధానాంశంగా చేసుకున్నారు. జల్లికట్టు క్రీడను సమర్ధిస్తున్న వాళ్ళ మీదకు 100 బుల్స్‌ను వదలి

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ మరోమారు ట్వీట్‌తో వార్తలకెక్కాడు. ఈ దఫా ఆయన జిల్లికట్టును తన ట్వీట్‌కు ప్రధానాంశంగా చేసుకున్నారు. జల్లికట్టు క్రీడను సమర్ధిస్తున్న వాళ్ళ మీదకు 100 బుల్స్‌ను వదలి ఆ తర్వాత వాళ్ల ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలని ట్విట్టర్‌లో కోరాడు. 
 
ఈ క్రీడ కోసం పోరాడుతున్న వాళ్లు అనాగరికులని, అందుకే జంతువును హింసించే హక్కు కోసం పోరాటం చేస్తున్నారని, అమాయక జంతువులను హింసించే జల్లికట్టు సాంప్రదాయం కరెక్ట్ అయితే అమాయక ప్రజలను హింసించే అల్‌ఖైదా కూడా కరెక్టేనని రాసుకొచ్చాడు. 
 
సినిమాల్లో కాకులను, కుక్కలను చూపించడం నేరమని, సాంప్రదాయం పేరుతో ఎద్దులను రాక్షసంగా హింసించడాన్ని ప్రభుత్వం సమర్థించడం ఏంటని ఆయన ప్రశ్నించాడు. ఈ క్రీడ పేరుతో అమాయకమైన జంతువులను హింసిస్తూ దానికి సాంప్రదాయం అని పేరు పెట్టుకుని తప్పించుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశాడు. 
 
రక్షణ లేని జంతువులను సాంప్రదాయం పేరుతో హింసించడం టెర్రరిజం కన్నా ఘోరమని, ఆ జంతువులకు ఓటు హక్కు ఉంటే ఒక్క రాజకీయ నేతైనా జల్లికట్టుకు సపోర్ట్ చేసేవారా అంటూ ఆరోపించాడు వర్మ.