శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2016 (08:58 IST)

ముఖేష్ అంబానీనే లక్ష్మీదేవి ఎక్కువగా ప్రేమిస్తుంది.. ఎందుకోమరి: రాంగోపాల్ వర్మ

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని లక్ష్మీదేవి ఎక్కువగా ప్రేమిస్తుందని, ఆయనపై అంత ప్రేమ ఎందుకో తెలియదని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని లక్ష్మీదేవి ఎక్కువగా ప్రేమిస్తుందని, ఆయనపై అంత ప్రేమ ఎందుకో తెలియదని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు.
 
సాధారణంగా రాంగోపాల్ వర్మ అంటేనే వెరైటీ కామెంట్లు, విమర్శలు, వ్యంగ్యం అన్నీ కలిపి గుప్పిస్తాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగలు, పబ్బాలు, రాజకీయాలు, నేతలు, సినిమాలు, అవార్డులు, దేవతలు.. ఇలా ఏ అంశాన్నీ వదలకుండా తనదైన శైలిలో ట్వీట్ చేసే వర్మ తాజాగా ముఖేష్ అంబానీని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. 
 
'అమ్మవారు లక్ష్మీదేవిని పూజించే వాళ్లు ఎంతో మంది ఉండగా, ముఖేష్ అంబానీనే ఆమె ఎక్కువగా ప్రేమిస్తుంది ఎందుకో? ప్రత్యేకంగా ఆయనేమైనా ప్రార్థిస్తారా? లేక బయటకు చెప్పటానికి వీలుకాని ‘డీల్’ ఏదైనా వారి మధ్య ఉందా?' అంటూ సరదాగానో లేక వ్యంగ్యంగానో వర్మ తన ట్వీట్‌లో ప్రశ్నించారు.