ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (15:01 IST)

జయసుధగారూ.. మీరు పాడిన పాట వింటే... ఆర్జీవీ ట్వీట్స్

ram gopal varma
సహజ నటి జయసుధపై తెలుగు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. జయసుధగారూ మీరు పాడిన పాట వింటే విశ్వాసం లేని వారుకూడా విశ్వాసులుగా మారిపోతారు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, జయసుధ పాటకు సంబంధించిన యూట్యూబ్ చానెల్ లింకును కూడా ఆయన షేర్ చేశారు. 
 
కాగా, జయసుధ, మోహన్ బాబులతో 2014లో ఆయన "రౌడీ" అనే చిత్రాన్ని నిర్మించారు. అలాగే, జయసుధతో "మనీ", "మనీ మనీ" సినిమాలను కూడా నిర్మించారు. తాజాగా ఆమెను ఆకాశానికెత్తుతూ ట్వీట్ చేశారు. 
 
నిజానికి జయసుధను ఆర్జీవి అమితంగా ఆరాధిస్తారు. ఓ సినిమా పోస్టరుపై ఉన్న జయసుధను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోయారట. "శివరంజని" సినిమాలో జయసుధ చేత కన్నీరు పెట్టించినందుకు మోహన్‌బాబుపై ద్వేషం కూడా పెంచుకున్నారు. అదేసమయంలో "దైవపుత్రుడు" అనే చిత్రంలో జయసుధ క్రైస్తవ గీతాన్ని ఆలపించారు. ఈ గీతంపై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించారు.