శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (11:12 IST)

ఆర్నాబ్- ది న్యూస్ ప్రొస్టిట్యూట్: వర్మ సంచలనం, ఇద్దరితో గోవా వెళ్తున్నాడు

రాంగోపాల్ వర్మ క్రియేటివ్ దర్శకుడు ట్యాగ్ లైన్ నుంచి వివాదాస్పద దర్శకుడిగా మారిపోయాడు. వరసబెట్టి దేశంలో పాపులర్ అయిన వ్యక్తుల గురించి సినిమాలు తీసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. తాజాగా ‘అర్నాబ్: ది న్యూస్ ప్రొస్టిట్యూట్’ మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. 
 
దీనిపై ట్వీట్‌లో ఆయన ఇలా వ్రాశారు, ‘తేడా ఏమిటంటే ఒక సాధారణ వేశ్య ఇతరులను అలరించడానికి ఆమె బట్టలు తీసేస్తుంది. అయితే, అతను తనను తాను అలరించడానికి ఇతరుల దుస్తులను తీసివేస్తాడు ARNAB ది న్యూస్ ప్రొస్టిట్యూట్’. ఇంతకుముందు, రిపబ్లిక్ టీవీ బాలీవుడ్ పైన చర్చను ఏర్పాటు చేసిన తరువాత అర్నాబ్ గోస్వామిపై సినిమా చేయాలని చిత్ర నిర్మాత నిర్ణయించారు.
కాగా కరోనావైరస్ ప్రభావంతో థియేటర్లు మూతడటంతో ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. కానీ వర్మ మాత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫాంల పైన దృష్టి పెట్టి ‘క్లైమాక్స్', ‘నగ్నం', ‘పవర్ స్టార్' వంటి సినిమాలు తీసి సొమ్ము చేసుకున్నాడు. అంతేకాదు.. తాజాగా ఇద్దరమ్మాయిలతో ఆర్జీవీ ప్రయోగం వరుసగా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నారు.
 
ప్రస్తుతం ‘డేంజరస్' అనే మూవీని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అప్సరా రాణి, నైనా గంగూలీలు లెస్బియన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం థీమ్ లైన్ గురించి చెప్తూ లెస్బియన్లు తమ ప్రేమ కోసం చావడానికైనా, ఎవరినైనా చంపడానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పాడు. మరో విషయం ఏంటంటే... వీళ్లిద్దరినీ తీసుకుని తన మకాంను గోవాకు మార్చేస్తున్నాడట వర్మ. మరి అక్కడి ప్లానేంటో?