శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 నవంబరు 2016 (10:52 IST)

చేగువేరా కంటే పవన్‌నే ఇష్టపడుతా.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్..పవర్ ఫ్యాన్స్ ఫైర్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషలీ మీడియాలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. మర

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషలీ మీడియాలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. మరో సారి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి.. సెటైర్ వేయడం ద్వారా ఆయన అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పించాడు. 
 
క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రో మరణించిన తరువాత పవన్ స్పందిస్తూ.. "నేను చాలా గౌరవించే వ్యక్తి 'చే' తో కలసి నడిచిన ఫిడెల్‌ను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి" అని ట్వీట్ చేశాడు.

అయితే దీనిపై వర్మ స్పందిస్తూ.. "పవన్ కల్యాణ్ కాంప్లిమెంట్‌ను చూసిన తరువాత 'చే గువేరా' ఆత్మ శాంతంగా ఉండదు సరికదా... ఆనందంతో గంతులేస్తుంది. నేనైతే మాత్రం చెగువేరా కన్నా పవన్‌నే ఇష్టపడతాను" అన్నాడు. వర్మ వేసిన ఈ సెటైర్‌ను సీరియస్‌గా తీసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు.