శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (12:35 IST)

ఎన్టీఆర్ శత్రువులెవరో - మిత్రులెవరో అందులో వెల్లడిస్తా : రాంగోపాల్ వర్మ

స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రాన్ని నిర్మించనున్నట్టు విదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం అధికారికంగా ప్రకటించారు.

స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రాన్ని నిర్మించనున్నట్టు విదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ శత్రువులెవరో, మిత్రులెవరో.. ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనుక అసలు కాంట్రవర్సీ ఏంటో చెబుతానంటూ వర్మ ఓ పాటను విడుదల చేశారు. బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కనుంది. దీంతో ఎన్టీఆర్ బయోపిక్‌ను డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరనే విషయంపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. 
 
వర్మ తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన 'జై ఎన్టీఆర్' పాటను విడుదల చేశాడు. ఈ పాటను ఈ సినిమా కోసమే ఆయన రూపొందించాడు. తాను ఎన్టీఆర్ సినిమాను ఎందుకు తీస్తున్నానో వివరిస్తూ ఆయన ఓ ఆడియో విడుదల చేశాడు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగువాడిని తలెత్తుకునేలా చేశాయని వర్మ తెలిపాడు. ఎన్టీఆర్ పేరు వింటేనే స్వాభిమానం తన్నుకొస్తుందని... ఛాతి గర్వంతో ఉప్పొంగుతుందని చెప్పారు. ఆయన మహా నటుడే కాదని... మన తెలుగు నేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా అత్యధిక ప్రజాదరణ కలిగిన అంతటి రాజకీయ నేతను చూడలేదని అన్నాడు.  
 
తనకు ఎన్టీఆర్‌తో ఉన్న వ్యక్తిగత అనుబంధంపై మాట్లాడుతూ... ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'అడవిరాముడు'ను తాను 23 సార్లు చూశానని తెలిపాడు. ఆయన సినిమా చూసేందుకు బస్సు టికెట్‌కు డబ్బుల్లేక, 10 కిలోమీటర్లు నడిచి థియేటర్‌కు వెళ్లానని చెప్పాడు. ఎన్టీఆర్ నిర్వహించిన టీడీపీ తొలి మహానాడుకు లక్షలాది మంది తరలి రాగా అందులో తాను కూడా ఉన్నానని వర్మ తెలిపాడు. అంతటి సామాన్యుడినైన తాను... ఇప్పుడు ఆ మహానుభావుడి బయోపిక్‌ను తెరకెక్కించడం పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు.
 
'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అని రాయప్రోలుగారు అంటే... ఓ సినిమా దర్శకుడిగా కాకుండా ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల్లో ఒకడిగా ప్రపంచంలో నలు మూలలా ఉన్న తెలుగువారందరికీ 'ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్‌ను' అని పాడమని చెబుతానని తెలిపాడు.