శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 12 జనవరి 2017 (15:08 IST)

'గౌతమిపుత్ర శాతకర్ణి'పై వర్మ కామెంట్స్‌.. అరువు విజయం కాదు.. యధార్థ గెలుపు

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. తన తీర్పు నిజం కావడం చాలా థ్రిల్‌గా ఉందన్నారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి అద్భుతమైన స్పంద

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. తన తీర్పు నిజం కావడం చాలా థ్రిల్‌గా ఉందన్నారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఆయన అభినందనలు తెలిపారు. దర్శకుడు క్రిష్‌కు, బాలయ్యకు 100 చీర్స్‌ అని ట్వీట్‌ చేశారు. 
 
అరువు తెచ్చుకున్న కథతో కాకుండా.. యదార్థ కథతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఆకాశానికి తీసుకెళ్లారని.. ఇందుకు దర్శకుడు క్రిష్‌, బాలయ్యకు తాను సెల్యూట్‌ చేస్తున్నట్లు చెప్పారు. బాలకృష్ణ 100వ చిత్రం 150 సార్లు గొప్ప చిత్రంగా నిలిచిందనే అర్థంతో వర్మ ట్వీట్‌ చేశారు.
 
మరోవైపు... 'శాతకర్ణి ' పాత్రలో బాలకృష్ణ జీవించాడనేది యానిట్ టాక్. ఇక వశిష్టా దేవి పాత్రలో శ్రియ కనిపించింది. చాలాకాలం తర్వాత ఈ మూవీలో బాలకృష్ణతో జతకట్టింది. అయితే శ్రియ చేసిన పాత్రని మొదట నయనతారతో చేయించాలని బాలయ్య అనుకున్నాడు. కానీ, చిత్రం రిలీజ్ అయ్యాక శ్రియనే వశిష్ట పాత్రకు బెస్ట్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.