రామ్ ప్రియాంకా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం 2 ప్రారంభం
సవ్య శాచి కథ నాయకుడిగా శ్రీ సాయి విశ్వనాథ్ రెడ్డి సమర్పణలో రామ్ ప్రియాంకా మీడియా ఎంటర్ టైంమెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెం 2 చిత్రం ఈ రోజు (21-04-2016) లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత ఈడ్పుగంటి శేషగిరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు జి.ఎన్.ఎస్. ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఫిల్మ్ నగర్ సాయి బాబా సన్నిధిలో పూజా కార్యక్రమాల అనంతరం యువ కథానాయకుడు సవ్య శాచిపై ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు జి. రామ్ ప్రసాద్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలో తెలియజేస్తాం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం జి. ఎన్. ఎస్. ప్రసాద్, మాటలు- రాజేంద్ర భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-పరిటాల రాంబాబు, నిర్మాత-ఈడ్పుగంటి శేషగిరి.