శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (19:52 IST)

రామబాణం ఫస్ట్ సింగిల్ ఐఫోన్ లిరికల్ వీడియో

Gopichand, Dimple Hayati
Gopichand, Dimple Hayati
గోపీచంద్ రామబాణం ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు రామబాణం ఫస్ట్ సింగిల్ ఐఫోన్ లిరికల్ వీడియోను విడుదల చేసిన మ్యూజికల్ జర్నీ ప్రారంభించారు.
 
మిక్కీ జె మేయర్ హై-స్పీడ్ బీట్‌లతో కూడిన మాస్ డ్యూయెట్‌ను కంపోజ్ చేశారు. అద్భుతమైన వోకల్స్, సూపర్బ్ డ్యాన్సులు, క్లాసీ విజువల్స్ తో ఇది మాస్ యుఫోరియాను సృష్టిస్తుంది. మాస్ పాటలు రాయడంలో స్పెషలిస్ట్ అయిన కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. తెలంగాణ యాసలో ఈ పాటను రాశారు. రామ్ మిరియాల, మోహన భోగరాజు వోకల్స్ లో కావాల్సిన ఎనర్జీ ఉంది.
 
గోపీచంద్, డింపుల్ హయాతి  గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. ఈ మాస్ డ్యూయెట్ లో చాలా కూల్‌గా కనిపించి, రాకింగ్ కెమిస్ట్రీని పంచుకున్నారు. గోపీచంద్ స్టైలిష్ అవతార్‌లో కనిపించగా, డింపుల్ సూపర్-హాట్‌గా కనిపించారు. ఐఫోన్ మాస్ ని ఆకట్టుకుటుంది.
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.
 
భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ సంగీతం ఈ చిత్రానికి బలం చేకూర్చనున్నాయి. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్.