సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (15:09 IST)

సల్మాన్ ఖాన్ సినిమాలో రామ్‌చరణ్‌ డాన్స్ (video)

Salman Khan, Ram Charan,  Venkatesh
Salman Khan, Ram Charan, Venkatesh
చిరంజీవి గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ నటించారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలో రామ్‌చరణ్‌ నటించాడు.  గ్లోబల్‌ స్టార్‌ గా మారిన రామ్‌చరణ్‌ ''కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'లో స్పెషల్ అప్పియరెన్స్ అదిరిపోయింది. లుంగీ డాన్స్ చేశారు.  
 
'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'లోని 'యెంటమ్మా' వీడియో సాంగ్ తెలుగు సినీ అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్, పూజా హెగ్డేలు కూడా ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్లోయింగ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు.
 
మెరిసే పసుపు చొక్కా మరియు తెలుపు లుంగీలో మెగా పవర్ స్టార్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. అతను తన నిజ జీవిత స్నేహితుడు సల్మాన్ మరియు టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్‌తో డాన్స్ చేశారు. ఈ పాటను పాయల్ దేవ్ స్వరపరిచారు. ఆర్.ఆర్.ఆర్. తరహాలో కొంచెం చేంజ్ చేసి ఈ పాటకు స్టెప్ లు వేశారు.  ఈద్‌కు ఈ చిత్రం తెరపైకి  రానుంది. ప్రస్తుతం చరణ్  'గేమ్ ఛాంగర్' షూట్ లో ఉన్నారు.