సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (18:24 IST)

నా బిడ్డ నా కోరికను తీరుస్తున్నాడు :మెగాస్టార్‌ చిరంజీవి

45 years journy chiru
45 years journy chiru
మెగాస్టార్‌ చిరంజీవి 45 సంవత్సరాల మెగా జర్నీని నేటితో పూర్తి చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన ప్రయాణం. ప్రాణం ఖరీదు తో కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ అభిమానులు అబ్బురపరిచే విధంగా ప్రదర్శనలతో కొనసాగుతోంది చిరంజీవి  కెరీర్. అందుకే తీపి గుర్తు గా తన తండ్రికి రామ్ చరణ్ సి.డి.పి .ని తయారుచేశారు. చిరంజీవి గారి ప్రముఖ స్పీచ్ లతో కూడిన వీడియోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
 
45 years journy chiru
45 years journy chiru
అందులో ఒక దానిలో చిరంజీవి మాట్లాడుతూ, చిరంజీవి నువ్వు ఏమి సాధించావు అంటే.. రామ్ చరణ్ ను సాధించాను. ఎవరికైనా కొడుకును ప్రమోట్ చేయాలని, స్టార్ గా చూడాలని ఉంటుంది. కానీ ఇక్కడ నా బిడ్డ నా కోరికను తీరుస్తూ ముందుకు సాగుతున్నాడు.. అనగానే .. చరణ్.. చిరు పాదాలకు నమస్కరించాడు. ఇదే.. ఫ్యాన్కు ఫిదా చేసింది. 
 
మీరు మీ ఆన్ స్క్రీన్ ప్రదర్శనలు,  మీ ఆఫ్ స్క్రీన్ మానవతా కార్యకలాపాలతో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కృషి, అంకితభావం, శ్రేష్ఠత మరియు అన్నింటికంటే ముఖ్యంగా కరుణ వంటి విలువలను పెంపొందించినందుకు నాన్నగారికి ధన్యవాదాలు అంటూ  చరణ్ తెలిపారు. 
 
అఖిల భారత చిరంజీవి యువత -రవణం స్వామినాయుడు మాట్లాడుతూ,  అన్నయ్యా..
1978 సెప్టెంబర్ 22న ప్రాణంఖరీదు సినిమాతో సినీ బడిలో ఓనమాలు దిద్ది.. ఇంతై.. ఇంతింతై అన్నట్టు కొనసాగిన మీ నటప్రస్థానం నేటితో 45ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయం. శిఖరమంత ఎత్తులో ఉన్నా తొలిరోజు నిబద్ధత, క్రమశిక్షణ, వినమ్రతే ఇప్పటికీ మీలో చూస్తున్నాం. ఇవే మీకు ఆభరణాలు. ఇన్నేళ్ల ప్రస్థానంలో మీరు ఎదిగారు.. తెలుగు సినిమా వైభోగం పెంచారు.. ఎందరికో ఆదర్శమయ్యారు. తరాలు మారుతున్నా మీపై ఇష్టం పెరిగేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం మీ ప్రత్యేకత. సినిమా కోసం ఇప్పటికీ మీరు కష్టాన్ని ఇష్టంగా చేసుకోవడం.. మీపై తెలుగు ప్రేక్షకులు చూపే తరగని అభిమానానికి కారణం. 
 
అభిమానులుగా మీ వెన్నంటే ఉంటాం.. మీ మాటే మాకు శాసనం.. మీ బాటే మాకు మార్గం. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించాలని.. మమ్మల్ని అలరించాలని.. ఎందరికో స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.