శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : శనివారం, 6 జులై 2019 (12:16 IST)

యాంకర్ అవతారమెత్తనున్న రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటివరకు హీరోగా నటించాడు, అలాగే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. అదేమిటా అని ఆలోచిస్తున్నారా? అదేనండీ..యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడట.
 
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరానరసింహారెడ్డికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదల ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సినిమా రిలీజ్‌కి ముందే సినిమాకి సంబంధించి ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసారట.
 
అందులో భాగంగానే రామ్ చరణ్ యాంకర్‌గా అవతారం ఎత్తనున్నాడు. సైరా టీంలోని ప్రతిఒక్కరినీ చరణ్ ఇంటర్వ్యూ చేస్తారు. ముందుగా చిరంజీవిని చరణ్ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ విధంగా ఇంటర్వ్యూ చేసిన వీడియోలను ఒక్కొక్కటిగా బయటకు రిలీజ్ చేసి సినిమాకి హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారట. 
 
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా గ్యాప్‌లో చరణ్ సైరా సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌లలో పాల్గొంటాడని సమాచారం. ఈ చిత్రాన్ని ఎలాగైనా అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట.