శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 27 జులై 2017 (09:50 IST)

ఇంతకీ చార్మీని సిట్ విచారించిందా.. సిట్‌ని చార్మీయే విచారించిందా.. రాజసంగా ఫోజిచ్చింది కదా!

ఒకవైపు డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణకు హాజరైన సినీ నటి చార్మిని ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో వరుస కామెంట్లు పెడుతున్నారు. అతడి కామెంట్లకు వ్యతిరేకంగా కామెంట్లు కూడా బాగానే పేలుతున్న

ఒకవైపు డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణకు హాజరైన సినీ నటి చార్మిని ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో వరుస కామెంట్లు పెడుతున్నారు. అతడి కామెంట్లకు వ్యతిరేకంగా కామెంట్లు కూడా బాగానే పేలుతున్నాయి కానీ వర్మని ఎంత ఆడిపోసుకున్నా కొన్ని నిజాలు మాత్రం ధైర్యంగా చెబుతున్నట్లే కనిపిస్తోంది. ఇంతకీ వర్మ ఏమన్నాడో చూద్దాం.  సిట్‌ విచారణ ముగిసిన అనంతరం ధైర్యంగా బయటకు వచ్చిన చార్మిని చూస్తే.. ఆమెను సిట్‌ విచారించినట్టుగా కాకుండా ఆమెనే సిట్‌ను ప్రశ్నించినట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. దర్యాప్తు తర్వాత చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ధైర్యంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. సిట్‌ విచారణ సందర్భంగా చార్మి గోర్ల నమూనాలను తీసుకోవడం కాదు.. ఆమె మేకప్‌ చేసుకున్నట్టు కనిపిస్తున్నదని వర్మ పేర్కొన్నారు.
 
అయితే, దర్శకుడు వర్మ అలా అనడం సరైంది కాదు అని పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'చార్మి వీరనారి కాదు.. సిట్‌ అధికారులు ఆంగ్లేయులు కాదు. చార్మిని ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చడం సరికాదు' అని జొన్నవిత్తుల అన్నారు. దీనిమీద  కూడా నెటిజన్లు కేక పెడుతున్నారనుకోండి. 
 
కాని ఒక విషయం మాత్రం అంగీకరించాల్సిందే. బుధవారం జరిగిన సిట్ విచారణలో పాల్గొన్న సినీ నటి చార్మీ సిట్ కార్యాలయానికి వెళ్లేటప్పుడూ తిరిగి వచ్చేటప్పుడూ ఎంత రాజసాన్ని ప్రదర్సించిందంటే అసలు ఆమె ఇంటరాగేషన్‌ని ఎదుర్కొనేందుకు వెళ్లిందా లేక తానే సిట్‌ను ఇంటరాగేట్ చేయడానికి వెళ్లిందా అనే రేంజిని చూపించేసింది. లోపలకు వెళ్లేటప్పుడు మగపోలీసు నన్ను చెయ్యి పట్టుకుని తాకాడని ఆరోపిస్తూ నేరుగా సిట్ అధికారులనే డిఫెన్సులో పడేసింది. చార్మీ ఆరోపణతో బిత్తరపోయిన సిట్ అధికారులు తేరుకుని ఈ విషయాన్ని పరిశీలించి పోలీసు తప్పు చేసి ఉంటే తప్పక చర్య తీసుకుంటామని సంజాయిషీ ఇచ్చేశారు. ఇది చార్మీ సిట్ మీద సాధించిన తొలి విజయం అని చెప్పవచ్చు. డ్రగ్స్ కేసులో తన పాత్ర గురించి ప్రశ్నలవర్షం కురిపిస్తారన్న భయం ఏమాత్రమూ లేకుండానే తన హక్కుల విషయంలో చార్మీ రాజీ పడకపోవడం గొప్పే కదా.
 
ఆ తర్వాత 5 గంటలపాటు విచారణ జరిగి చార్మీ సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రదర్శించిన రాజసం ఇంతా అంతా కాదు. ఆడపోలీసుల మధ్యలో కార్యాలయం ద్వారం నుంచి అడుగుపెట్టిన చార్మీ నీళ్లబ్యాటిల్‌ పట్టుకుని సుతారంగా తాగుతూ ఏమీ జరగనట్లు నవ్వుతూ నడిచి వచ్చింది. పైగా మీడియా వాళ్లపైపు దయ చూపినట్లుగా చేతులు ఊపి నవ్వింది. ఆమె బాటిల్ పట్టుకోవడం ఎలా ఉందందే లోపల విచారణ క్రమంలో తనకు సిట్ నీరు తాగించినట్లు కాకుండా తానే వారికి నీళ్లు తాపించినట్లుగా ఫోజిచ్చింది.
 
సోమవారం వరకు సిట్ అధికారులు తనను ఏం చేస్తారు అని హడలి చచ్చిన చార్మీ తర్వాత హైకోర్టు గుమ్మం తొక్కాక ఉన్నట్లుండి ధైర్యం తెచ్చుకుంది. సినిమా వాళ్లు చాలామందిని కలుస్తుంటారు. చేతులు కలుపుతుంటారు. ఫోటోలకు ఫోజులిస్తుంటారు. అయినంత మాత్రాన వారితో సంబంధాలున్నట్లేనా, డ్రగ్స్ వ్యవహారంలో వారితో చేతులు కలిపినట్లేనా..అంటూ ఎక్కడా తొట్రుపాటు అనేదే లేకుండా చార్మీ సమాధానాలు ఇచ్చేసి బయటకు వచ్చేసింది.