శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (23:07 IST)

పీకే(పవన్ కళ్యాణ్)ను ఏకేస్తున్న ఆర్జీవి(వర్మ)... చిరు కంటే పవన్ వరెస్ట్ అంటూ...

కాపు రిజర్వేషన్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానంపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిప్పులు చెరిగారు. వరుస ట్విట్టర్లతో కడిగిపారేశారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో పీకే(పవన్ కళ్యాణ్) మాట్లాడింది ఆయనకైనా అర్థమైందా అంటూ మొదలెట్టారు. అంతేకాదు ఓ విశ్వదాభిరామ పద్యాన్ని కొత్త పద్ధతిలో చెప్పారు. 
 
అదేమిటంటే... 'కమ్మల మనస్తత్వమున్న కాపుల కన్నా స్వచ్చమైన కమ్మల మనసున్న కాపులు బహు మేలు... విశ్వదాభిరామ వినురవేమ' అంటూ ట్వీట్ చేశారు. ఇంకా వర్మ తన ట్వీటులో పీకేకి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా విజ్ఞప్తి, ఒక్కసారి మీరిచ్చిన జనసేన స్పీచ్ మీకు మీరే చూసుకుని మీరే నేర్చుకోండి. 
 
పీకే అభిమానిగా నేను వ్యక్తపరిచిన నిజాలను వ్యతిరేకించే ఏ పీకే ఫ్యాన్ అయినా నా దృష్టిలో నమ్మకద్రోహే. మళ్లీ చెపుతున్నా... పీకే తన జనసేన లాంఛ్ స్పీచ్ ను రిపీట్ మోడ్ లో చూసుకుని అర్థం చేసుకుంటే తన అన్నయ్య కంటే వరెస్ట్ అని అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు నా విజ్ఞప్తి ఏమంటే.. మీరంతా ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నారు. కాబట్టి నేను చెప్పిన నిజాన్ని పీకేకు చెపుతారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.