శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (14:31 IST)

చంద్ర‌బాబుకు షాక్ మీద షాక్ ఇస్తున్న వ‌ర్మ..‌. (video)

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చేయ‌డం... ఆ సినిమాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రిలీజ్ చేయ‌కుండా చంద్ర‌బాబు అడ్డుకోవ‌డం తెలిసిందే. అప్ప‌టి నుంచి చంద్ర‌బాబు గురించి తెలుగుదేశం పార్టీ గురించి ట్వీట్ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు వ‌ర్మ‌. జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు వర్మ.
 
ఒక రాజ‌కీయ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్ అని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. 
ఇదిలాఉంటే... వ‌ర్మ తెలుగుదేశం పార్టీ గురించి స్పందిస్తూ... తెలుగుదేశం పార్టీ ప‌గ్గాల‌ను తార‌క్‌కి అప్ప‌చెప్పాల‌న్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని కాపాడగ‌ల వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే... అది ఒక్క తార‌క్ మాత్ర‌మే. అందుచేత తార‌క్‌కి పార్టీ ప‌గ్గాలు అప్ప‌చెప్పాలి అన్నారు.
 
అంతేకాకుండా తాత మీద ఏ మాత్రం గౌర‌వం ఉన్నా తార‌క్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని కోరారు. ఈవిధంగా తెలుగుదేశం పార్టీ గురించి ట్వీట్ చేస్తూ చంద్ర‌బాబుకు షాక్ మీద షాక్ ఇస్తున్నారు.