Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే : నటి రమ్య నంబీశన్ వ్యాఖ్యలు

బుధవారం, 12 జులై 2017 (09:41 IST)

Widgets Magazine
ramya nambeesan

లైంగికదాడికి గురైన మలయాళ నటి భావనకు అండగా నిలిచేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ దాడి కేసులో మలయాళ సినీ స్టార్ దిలీప్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దీంతో భావనపై జరిగిన లైంగిక దాడిపై మాట్లాడేందుకు ఇన్నాళ్లూ సంకోచించిన పలువురు నటీనటులు ఇప్పుడు ముందుకు వచ్చి నోరువిప్పుతున్నారు. 
 
తాజాగా మరో హీరోయిన్ రమ్య నంబీశన్ భావనకు మద్దతు పలికింది. దీనిపై ఆమె స్పందిస్తూ... 'అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన భావనకు దక్కిన విజయమిది. నిజం ఎప్పటికైనా బయటపడుతుందనే నమ్మకంతోనే ఇంతకాలం పాటు వేచి చూశాం. ఎట్టకేలకు నిజం నిగ్గుతేలింది. హ్యాట్సాప్‌.. కేరళ పోలీసులు.. మేం ఎప్పుడూ భావనకు మద్దతుగా ఉంటాం' అంటూ పేర్కొంది. 
 
మరోవైపు.. ప్రముఖ డైరెక్టర్ విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి భావనపై జరిగిన లైంగిక దాడికి కారణం మలయాళ స్టార్ హీరో దిలీప్ అన్న సంగతి అందరికీ తెలుసని ఆరోపించారు. మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను దిలీప్ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని అన్నారు.  
 
అందుకే భావనపై జరిగిన లైంగిక దాడి వెనుక దిలీప్ ఉన్నాడని సినీ పరిశ్రమ మొత్తానికి తెలిసినా, అతనికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆయన తెలిపారు. అయితే బాధిత నటికి అండగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా భర్త చాలా మంచోడు... అవన్నీ వదంతులే : వరుణ్ సందేశ్ భార్య వితిక

టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ భార్య, సినీ నటి వితికా శేర్ ఆత్మహత్యకు పాల్పడిందంటూ సోషల్ ...

news

నయనతారా తన్నేసింది.. ఇక సంగమిత్రకు అనుష్కనే బతిమలాడతారా?

తెలుగు బాహుబలి సినిమాకు పోటీగా 450 కోట్ల ఖర్చుతో తీస్తున్నట్లు గొప్పలకు పోయిన తమిళ ...

news

చిరు 'నయనే'నట.. ఆగస్టు 15న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంచింగ్ డేట్..

చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ లాంచింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ...

news

పవన్ నోటి మళ్లీ పాట.. ఈసారి ఏ నరసింహుడో మరి..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ పాటెత్తుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ...

Widgets Magazine