Widgets Magazine

మెగా ప్రాజెక్టులో ర‌మ్య‌కృష్ణ‌...

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (16:58 IST)

ర‌మ్య‌కృష్ణ ఒక‌ప్పుడు అగ్ర‌హీరోల‌తో న‌టించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన తార‌. కొన్నాళ్లు సినిమాలు త‌గ్గించి బుల్లితెర పైన ప్ర‌త్య‌క్ష‌మైన ర‌మ్య‌కృష్ణ ఇటీవ‌ల బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌లో అద్భుతంగా న‌టించి..మ‌రోసారి త‌న‌కు తానే సాటి అని నిరూపించారు. తాజాగా అక్కినేని నాగ చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలో న‌టించారు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ నెల 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే... ర‌మ్య‌కృష్ణ మెగా ప్రాజెక్టులో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. 
Ramyakrishna
 
ఇంత‌కీ ఆ మెగా ప్రాజెక్ట్ ఏమిటంటారా..? అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో స‌క్స‌స్ సాధించిన యువ దర్శకుడు సాగర్ చంద్ర. వరుణ్ తేజ్‌తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించార‌ట‌. ఆమెకు ఆ పాత్ర న‌చ్చ‌డంతో  ఓకే చెప్పార‌ని తెలిసింది. ఈ సినిమాలోను రమ్యకృష్ణ పాత్ర ఆమె ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టు ఉంటుంద‌ట‌. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జరుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Ramyakrishna Mega Project

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆమెను మా ఆయన అలా చేయడం చాలా బాగుంది : సమంత

అక్కినేని నాగ చైతన్య, అనూ ఎమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం "శైలజా రెడ్డి అల్లుడు". ఈ ...

news

దర్శకత్వం వహించనున్న రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ త్వరలోనే ఓ ఇంటికి కోడలు కానుంది. పవన్‌తో ...

news

హాలీవుడ్ ఛాన్స్ ఎలా వచ్చిందో వివరించిన ప్రియాంకా చోప్రా

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు హాలీవుడ్ అవకాశాలు వరుబెట్టి వస్తున్నాయి. అయితే, ...

news

కమల్ హాసన్ 'విశ్వరూపం - 2' ఎలా ఉంది?

విశ్వనటుడుగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తాను ...

Widgets Magazine