గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మే 2020 (10:14 IST)

2020లో ఇంకా ఏమేమి చూడాల్సివస్తుందో.. హీరో నాని

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన ఇంతకాలం ప్రేమిస్తూ వచ్చిన ఓ యువతి పెళ్లికి పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించింది. అంతే.. ఈ శుభవార్తను రానా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై సినీ సెలెబ్రిటీలు తమ కామెంట్స్‌ను ట్వీట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ, ఈ 2020 సంవత్సరంలో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందోనంటూ చమత్కరించాడు. జోక్స్ సంగతి అటుంచితే, సూపర్ హ్యాపీగా ఉంది బాబాయ్ అంటూ ట్వీట్ చేశాడు. 
 
అంతేకాదు, 'హమారా బజాజ్' అంటూ సాగే పాత వాణిజ్య ప్రకటన తాలూకు వీడియోను కూడా అంకితం ఇస్తున్నట్టు తెలిపాడు. రానా పెళ్లాడబోతున్న అమ్మాయి ఇంటిపేరు 'బజాజ్' (మిహీక బజాజ్) కావడమే నాని ఈ వీడియోను పంచుకోవడానికి కారణం అని తెలుస్తోంది.
 
అలాగే, నటి మంచు లక్ష్మితో పాటు.. నటుడు నవదీప్, హీరోలు రామ్ చరణ్, నితిన్, మెగాస్టార్ చిరంజీవి వంటి అనేక మంది ప్రముఖులు రానాకు బెస్ట్ విషెచ్ చెప్పారు.