Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫిబ్రవరి 17న భారత్-పాకిస్థాన్ వార్ స్టార్ట్... రానా 'ఘాజీ' రిలీజ్

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:57 IST)

Widgets Magazine

ఈనెల 17వ తేదీన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వార్ జరుగనుంది. వార్ అంటే.. నిజంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. 1970లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఘాజీ. రానా, తాప్సీ, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి ముఖ్యపాత్రల్లో నటించారు. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. 
 
ఈ చిత్రాన్ని ఈనెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇదే అశంపై నిర్మాతలు మాట్లాడుతూ యుద్ధ సన్నివేశాలు రొమాంచితంగా ఉంటాయనీ, ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ చిత్రం సాగుతుందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది అన్నారు. ఓంపురి, నాజర్, రాహుల్‌సింగ్, మిలింద్ గునాజీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, మాటలు: గుణ్ణం గంగరాజు, నిర్మాతలు: అన్వేష్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నే, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంకల్ప్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బిల్లా రంగా' రీమేక్ : నాడు మోహన్‌బాబు.. చిరంజీవి - నేడు సాయిధరమ్.. మంచు మనోజ్

సుమారు 35 యేళ్ళ క్రితం వచ్చిన చిత్రం "బిల్లా రంగా". ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ...

news

'బద్రీనాథ్‌ కీ దుల్హనియా' ట్రైలర్‌ అదుర్స్.. 12 గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్‌-ట్రెండింగ్‌లో రెండో స్థానం

'బద్రీనాథ్‌ కీ దుల్హనియా' సినిమా ట్రైలర్‌కి యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తోంది. ...

news

డోనాల్డ్ ట్రంప్ నాకు ఆదర్శమంటున్న టాలీవుడ్ అగ్రహీరో ఎవరు?

డోనాల్డ్ ట్రంప్.. అమెరికా కొత్త అధ్యక్షుడు. ఈయన పేరు చెపితే అటు అమెరికా పౌరులు మాత్రమే ...

news

ఫిబ్రవరి 4న 4 గంటలకు 'కాటమరాయుడు' చిత్ర టీజర్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కాంబినేషన్‌లో డాలీ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ...

Widgets Magazine