మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 9 ఆగస్టు 2020 (13:21 IST)

బంధుమిత్రుల సమక్షంలో టాలీవుడ్ రానా, మిహీకాల పెళ్లి

టాలీవుడ్ రానా, మిహీకాల పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. కరోనావైరస్ కారణంగా అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు నాగ చైతన్య, సమంత, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, సుబ్బిరామిరెడ్డి, రాజమౌళి, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందగా వారిలో హాజరయినవారు కూడా బహు తక్కువగా వున్నట్లు తెలుస్తోంది.
రానా దగ్గుబాటి బాబాయి వెంకటేష్, తండ్రి సురేష్‌ బాబులు పెళ్లిలో సందడి చేసారు. కాగా రానా పెళ్లి సందర్భంగా ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెపుతున్నారు.