ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (15:31 IST)

సిల్వర్ స్క్రీన్ వార్ : రంగస్థలం వర్సెస్ మహానటి

వచ్చే యేడాది కూడా సంక్రాంతి వార్ తప్పేలా కనిపించడం లేదు. 2017 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150"తో పాటు.. యువరత్న బాలకృష్ణ నటించిన "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రాలు

వచ్చే యేడాది కూడా సంక్రాంతి వార్ తప్పేలా కనిపించడం లేదు. 2017 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం "ఖైదీ నంబర్ 150"తో పాటు.. యువరత్న బాలకృష్ణ నటించిన "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రాలు పోటీపడ్డాయి. ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ అయ్యాయి.
 
2017 జనవరి నెలలో నెలకొన్న పరిస్థితే 2018 సంక్రాంతికి రానుంది. ఇప్పుడు ఇదే సీన్ రెండు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలకు ఎదురవుతుంది. అసలు విషయానికి వస్తే.. తెలుగు అలనాటి మేటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా "మహానటి" సినిమా రూపొందిస్తున్నారు. సినిమాలో మహానటిగా కీర్తి సురేష్ నటిస్తుంది. 
 
తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేసింది చిత్ర బృందం. రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. మార్చి 29న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక మెగాస్టార్ తనయుడు రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న "రంగస్థలం" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఒక్క రోజు గ్యాప్‌లో ఈ రెండు సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏదైనా వాయిదా పడుతుందా? లేదా అనేది త్వరలో తెలుస్తుంది.