Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవితో సుకుమార్ మూవీ ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్

శనివారం, 14 ఏప్రియల్ 2018 (11:30 IST)

Widgets Magazine

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం "రంగ‌స్థ‌లం". ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ సాధించి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో సుకుమార్‌తో సినిమా చేసేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. సుకుమార్ త‌దుప‌రి చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌కే చేయ‌నున్న‌ట్టు వెల్లడించారు. కానీ, హీరో ఎవ‌రు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ఇదిలావుంటే ఇటీవల సుకుమార్ మాట్లాడుతూ, తన దగ్గర రెండు మూడు మంచి కథలు ఉన్నాయనీ, అవి ఎవరికి సెట్ అవుతాయనేది చూడాలన్నారు.
sukumar
 
అందులో ఒక కథను ఆయన చిరంజీవికి వినిపించాడనే టాక్ తాజాగా ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. 'రంగస్థలం' అది సాధించిన విజయం చూసిన చిరంజీవి, సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి ఆసక్తిని చూపడం వల్లనే కథ వినిపించాడట. చిరూ ఇలా తీరిక చేసుకుని మరీ కథ వినడం వెనుక చరణ్ ఉన్నాడని కూడా చెప్పుకుంటున్నారు. 
 
ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను రవితేజ అయితే బాగుంటుందని భావించి సుకుమార్ సంప్రదించడం.. ఆయన ఓకే అనడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ సైరా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని చెబుతున్నారు. మ‌రి.. ఇది నిజ‌మా కాదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' లేటెస్ట్ అప్ డేట్స్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా". ...

news

ఇండ‌స్ట్రీ పెద్ద‌లపై పోసాని ఫైర్.. ఎందుకు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌య‌మై ముఖ్యమంత్రి చంద్ర‌బాబ‌ుకు తెలుగు ...

news

నాలుగు భాష‌ల్లో 'రంగ‌స్థ‌లం' .. 13 రోజుల్లో రూ.175 కోట్ల గ్రాస్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం "రంగ‌స్థ‌లం". సుకుమార్ ...

news

ఆగ‌లేక‌పోతున్న అఖిల్... ముందే చూపిస్తాన‌న్న పూరి..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్... తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ ...

Widgets Magazine