బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శనివారం, 16 జనవరి 2021 (17:31 IST)

రాణి రుద్రమదేవి, స్టార్‌ మాలో అద్భుతంగా చూపిస్తారట

తెలుగు టెలివిజన్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా 'స్టార్‌ మా' ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కొత్తరకం కథల్ని, ధైర్యసాహసాల వ్యక్తుల విశిష్ట గాధల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ఎప్పుడూ కొత్తదనానికి అగ్ర తాంబూలం ఇస్తూ వస్తున్న 'స్టార్‌ మా' ఇప్పుడు ఓ అద్భుతమైన చారిత్రక సువర్ణాధ్యాయాన్ని తమ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. అది "రుద్రమదేవి" సీరియల్‌.
 
ఏ పేరు వింటే ప్రతి తెలుగు హృదయం ఉప్పొంగుతుందో.. ఆ కథే ఇప్పుడు ఓ అద్భుతమైన ధారావాహికగా తెలుగు లోగిళ్లకు గొప్ప అనుభూతిని పంచబోతోంది. స్ట్రెయిట్‌ తెలుగు సీరియల్‌గా, ఓ దృశ్యకావ్యంలా రూపు దిద్దుకున్న ఈ రుద్రమదేవి ధారావాహిక కథాకాలాన్ని యథాతథంగా చిత్రీకరించేందుకు వందల మంది ఎంతగానో కషి చేస్తున్నారు. 
 
ఉన్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు దీక్షగా పనిచేస్తున్నారు. ఈ ధారావాహిక 'స్టార్‌ మా'లో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. ఇది మన తెలుగు కథ. మన తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న కథ. ఇంతకుముందు ఎన్నడూ బుల్లితెరపై కనిపించని ప్రమాణాలతో స్టార్‌ మా అందిస్తున్న కథ.