గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 జులై 2022 (12:44 IST)

Ranveer Singh: నగ్న ఫోజులిచ్చిన హీరోపై ముంబైలో కేసు నమోదు

Ranveer Singh
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన ఫోటోల ద్వారా మహిళల మనోభావాలను దెబ్బతీశారని, వారిని కించపరిచారని చెంబూరు పోలీస్ స్టేషన్‌కు అందిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు చేశారు.

 
సింగ్ ఒక మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసాడు. అందులో అతడు నగ్నంగా పోజులిచ్చాడు. ఇలా నగ్నంగా ఫోజిలివ్వడమే కాదు... నగ్నంగా బహిరంగంగా తిరగడానికి కూడా తానేమి సిగ్గుపడనని చెప్పాడు రణవీర్. ఈ వ్యాఖ్యలపై కొంతమంది వ్యతిరేకంగా స్పందించంగా చాలామంది రణవీర్‌కి మద్దతు లభిస్తోంది. కొంతమంది ఇప్పటికే నగ్నంగా ఫోటోషూట్ చేసారనీ, అలాంటిది రణవీర్ చేస్తే తప్పేమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.