Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి-2కి బాలీవుడ్ ఫిదా.. రణ్‌వీర్ ట్వీట్‌కు జక్కన్న థ్యాంక్స్.. ట్వింకిల్ కన్నా కట్టప్పను..?

బుధవారం, 17 మే 2017 (20:33 IST)

Widgets Magazine

"బాహుబలి-2"కి బాలీవుడ్ స్టార్లంతా ఫిదా అవుతున్నారు. రాజమౌళితో పాటు బాహుబలి టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా రణవీర్ సింగ్ కూడా బాహుబలి-2 ఫ్యాన్ క్లబ్‌లో చేరిపోయాడు. రాజమౌళిని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ చేస్తే మౌళి కూడా స్పందించి థ్యాంక్స్ చెప్పాడు.
 
ఇక అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా తామీ చిత్రాన్ని సోమవారం చూశామని, భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత రాజమౌళికే దక్కుతుందని ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. ట్వింకిల్ అయితే కట్టప్పను తన అభిమాన నటుడిగా చెప్పుకుంది. ట్వింకిల్ ఖ‌న్నా క‌ట్ట‌ప్ప న‌ట‌న‌కు ఫిదా అయిపోయింది. ఎంత‌లా అంటే త‌న కూతురును క‌ట్ట‌ప్ప అని పిలిచేస్తోంద‌ట‌.
 
క‌ట్ట‌ప్ప న‌ట‌న త‌న‌నెంతో ఆక‌ట్టుకుందంటూ ట్వీట్ చేసింది. అయితే ఇక్క‌డే ప‌ప్పులో కాలేసింది ఒక‌ప్ప‌టి ఈ ముద్దుగుమ్మ ట్వింకిల్‌. క‌ట్ట‌ప్ప పాత్ర‌ను పోషించింది త‌మిళ‌న‌టుడు స‌త్య‌రాజ్ కొడుకు సిబి స‌త్య‌రాజ్ అని భావించి అత‌నికి ట్వీట్ చేసింది. బాహుబ‌లి చిత్రంలో మీ న‌ట‌న అద్భుతంగా ఉందంటూ సిబీ స‌త్య‌రాజ్‌కు ట్వీట్ చేసింది. దీంతో రీట్వీట్ చేశాడు సిబీ స‌త్య‌రాజ్‌.
 
బాహుబ‌లి చిత్రంలో క‌ట్ట‌ప్ప క్యారెక్ట‌ర్ చేసింది త‌న తండ్రి స‌త్య‌రాజ్ అని చెప్ప‌డంతో షాక్‌కు గురైంద‌ట ట్వింకిల్‌. అంతేకాదు త‌న తండ్రి ట్వింకిల్ ఖ‌న్నా తండ్రి రాజేష్ ఖ‌న్నాకు వీరాభిమాని అని కూడా సిబి చెప్పుకొచ్చాడు. అంతేకాదు ట్వింకిల్ ద‌గ్గ‌ర‌నుంచి ట్వీట్ రావ‌డంతో త‌న తండ్రి స‌త్య‌రాజ్ హర్షం వ్యక్తం చేశాడని సిబి చెప్పుకొచ్చాడు. క‌ట్ట‌ప్ప న‌ట‌న‌కు ట్వింకిల్ ఖ‌న్నా ముగ్ధురాలై ఏకంగా ట్విట్టర్ డీపీని మార్చేసి క‌ట్ట‌ప్ప ఫోటోను పెట్టింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కట్టప్ప ఛాన్స్‌ను మిస్ చేసుకుంది ఎవరో తెలుసా?

'బాహుబలి-2' సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతో కీలకమో సినిమా చూసిన వారందరికీ తెలుసు. ఈ పాత్రకు ...

news

రజనీకాంత్ సరసన విద్యాబాలన్ లేదు.. హుమా ఖురేషికి బంపర్ ఛాన్స్..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో ఫోటోలు దిగుతూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ...

news

ములాయం "బాహుబలి 2" చిత్రం చూస్తుంటే.. నిలువుకాళ్లపై నిలబడిన కమాండో... నెటిజన్ల ఫైర్

ఎస్పీ అధినేత ములాయం సింగ్ చిత్రం చూస్తుంటే.. ఓ సెక్యూరిటీ మాత్రం శిక్ష అనుభవించాడు. అదీ 3 ...

news

దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా.. స్వచ్ఛమైన పాలన అందిస్తా : రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై సాగుతున్న ఊహాగానాలు మరింతగా చెలరేగాయి. ...

Widgets Magazine