Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ హీరోయిన్లతో పోల్చుకుంటే నా ఎక్స్‌పోజింగ్ ఎంత? రష్మీ గౌతమ్

శుక్రవారం, 3 నవంబరు 2017 (16:14 IST)

Widgets Magazine
Reshmi

రష్మీ గౌతమ్‌... తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు.. బుల్లితెరపై కూడా పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా బుల్లితెరకు గ్లామర్‌ సొబగులు అద్దిన ఘనత ఈమెకే చెందుతుంది. అందంగా మాట్లాడటమేకాకుండా అందంగా కనిపించడం, అందుకు తగిన డ్రస్సులు వేసుకోవడం ఈమె స్టైల్. ఈ ప్రత్యేకతలే ఆమెను బుల్లితెర నుంచి వెండితెర వైపు నడిపించాయి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా, గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చిపెట్టాయి. దాంతోపాటే వెండితెర మీద అందాల ఆరబోత ఆమెకు బోలెడంత గుర్తింపు తెచ్చిపెట్టింది. 
 
అయితే, ఎక్స్‌పోజింగ్‌పై రష్మీ స్పందిస్తూ, పాత్ర పరంగా డ్రెస్సులు వేసుకోవాలి. ‘గుంటూరు టాకీస్‌’లో అదే చేశాను. పైగా, ఈ చిత్రంలో పాత్ర పరంగా అందాల ఆరబోత ఉంది. అంతే తప్ప ప్రత్యేకంగా నేనేమీ ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు. కొందరు హీరోయిన్లతో పోల్చుకుంటే నేను ఎక్స్‌పోజింగ్‌ చేసేది తక్కువే. ఇంకాచెప్పాలంటే వారు చేసిన దానిలో 30 శాతం ఎక్స్‌పోజింగ్ కూడా చేయను. అయినా నా మీద అలాంటి ముద్ర ఎందుకు పడిందో నాకు అర్థం కాదు. గ్లామర్‌ గర్ల్‌ అనిపించుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదని అంటోంది. 
 
త్వరలో విడుదల కానున్న ‘నెక్ట్స్‌ నువ్వే’ చిత్రంలో చాలా భాగం సంప్రదాయబద్ధంగానే కనిపిస్తాను. ‘గుంటూరు టాకీస్‌’ తర్వాత నాకు మంచి పేరు తెచ్చే పాత్ర అవుతుంది. దీని తర్వాత మంచి మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను. ఈ సినిమాకి నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నట్టు వివరించింది. అయితే, ఈ చిత్రం ట్రైలర్‌లో ఉన్నట్టుగా సినిమాలో అందాల ఆరబోత ఉండదన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జీవితా రాజశేఖర్ కంటతడి పెట్టారు.. ఎందుకో తెలుసా? (వీడియో)

ఒకప్పుడు అంకుశం, మగాడు వంటి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలతో మెప్పించిన హీరో ...

news

గాయని పి.సుశీల ఆరోగ్యంపై వదంతులు... క్షేమంగా ఉన్నట్టు ట్వీట్

సీనియర్ సినీ నేపథ్యగాయని పి. సుశీల ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వివిధ రకాల వదంతులు ...

news

తల్లిపై ప్రతీకారం తీర్చుకుంటానంటున్న రాంగోపాల్ వర్మ

తనను తన తల్లి చాలా తక్కువగా అంచనా వేశారని, త్వరలోనే ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటానని ...

news

దర్శకుడు ఆ మాట అనేసరికి పక్కకెళ్లి ఏడ్చాను... నటి ప్రగతి

తల్లి, అక్క, వొదిన పాత్రల్లో నటించే ప్రగతి ఈ క్యారెక్టర్లను తనకు 25 ఏళ్లునప్పుడే చేయాల్సి ...

Widgets Magazine