శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (18:02 IST)

హోలీ సందర్భంగా యాంకర్ రష్మి రిక్వెస్ట్!

రష్మి... జబర్దస్త్ షోతో అందరికీ... పరిచయమై తర్వాత తెలుగు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండే రష్మి... తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల ఓ వీధి కుక్క జబ్బున పడితే దాన్ని చూసిన రష్మి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి తన వంతు సహాయం అందించి... మూగజీవుల పట్ల తన ప్రేమను చాటుకుంది. 
 
కాగా... ఈరోజు హోలీ సందర్భంగా అందరూ రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకుంటూంటే... రష్మి సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేసింది. ''ప్రతి ఒక్కరికీ నా తరఫున ఒక విన్నపం. కుక్కలపై, ఇతర జంతువులపై రంగులు పూయకండి. పొరపాటున రంగులు వాటి కళ్లలో పడితే అవి చూపు కోల్పోతాయి.  ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్లి మీ శరీరానికి అంటిన రంగులను శుభ్రంగా కడిగేసుకుంటారు. కానీ అవి అలా చేయలేవు'' అంటూ ట్వీట్ చేసి... జంతువులపై తన ప్రేమని మరోసారి నిరూపించుకుంది.