శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2024 (13:45 IST)

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసిన టాలీవుడ్ ప్రేమజంట!!

rashmika - vijay
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరాన్ని అహ్వానించబోతున్నాం. ఈ వేడుకలను ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు యువతతో ప్రేమికులు సిద్ధమయ్యారు. ఇలాంటి ప్రేమికుల్లో టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. వీరిద్దరూ న్యూ ఇయర్ వేడుకల కోసం విదేశాలకు చెక్కేశారు. వీరిద్దరూ కలిసి విదేశాలకు వెళుతున్న సమయంలో విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కారు. 
 
గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలపై వారు స్పందిస్తూ తామద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలు తరచూ కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఈ వార్తలను బలరిచే మరో ఘటన జరిగింది. 
 
సోమవారం వారిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిశారు. రష్మిక తొలుత ముంబైలో ల్యాండయ్యారు. అక్కడ ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా ముంబైలో వాలిపోయారు. దీంతో వారిద్దరూ కలిసి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం విదేశాలకు వెళ్ళబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ జంట రెస్టారెంట్‌లో కలిసి కనిపించిన ఫోటో ఒకటి వైరల్ అయింది. 
 
కాగా, రష్మికతో డేటింగ్ వార్తలపై విజయ్ దేవరకొండ ఇటీవల మాట్లాడుతూ, సమయం వచ్చినపుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని చెబుతానని పేర్కొన్నారు. అపరిమితమైన ప్రేమ అనేది ఉందో లేదో తనకు తెలియదని, ఒక వేళ ఉంటే దాంతోపాటే బాధ కూడా ఉంటుందని పేర్కొన్నారు.