రష్మిక మందన్న పుట్టినరోజు పుష్ప ది రూల్ అప్‌డేట్
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు సీక్వెల్‌గా పుష్ప ది రూల్ షూట్ జరుగుతోంది. ఇందుకోసం అల్లు అర్జున్ తన ఆహార్యంలో పలు మార్పులు చేసుకున్నారు. ఇప్పటివరకు అందరూ ఆర్.ఆర్.ఆర్. జోష్‌లో వుండడంతో పుష్ప2 గురించి వార్తలు కాస్త గేప్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఇక పుష్ప2పై సుకుమార్ ప్రచారాన్ని దృష్టి పెట్టాడు.
ఇందులో రష్మిక మందన్న కూడా తన పాత్ర గురించి ఇంకా షూట్ మొదలు కాలేదని, త్వరలో వెళ్ళి జాయిన్ అవుతానని నాకూ చాలా ఆతృతగా వుందని నిన్ననే వెల్లడించింది. కాగా, రష్మిక మందన్న పుట్టినరోజు ఈరోజు అందుకే అప్డేట్ ఇస్తున్నట్లు తెలిసింది. పుష్ప2కు సంబంధించి ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను ఏప్రిల్7న విడుదల చేయనున్నారని టాక్ వినిపించింది. కానీ చిత్ర యూనిట్ పుష్ప2 గురించి కొత్త అప్‌డేట్ మరికొద్దిసేపటిలో అంటే ఈరోజు 11గంటల తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపింది. మరి అదిఏమిటి? అనేది అల్లు ఫ్యాన్స్ ఎగైట్‌గా ఎదురుచూస్తున్నారు.